తదుపరి వార్తా కథనం
    
     
                                                                                Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Sep 14, 2024 
                    
                     09:58 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అరెకపూడి గాంధీతో పాటు తన సోదరుడు, కుమారుడు, కార్పొరేట్లు వెంకటేశ్, శ్రీకాంత్ గౌడ్ పైనా ఈ కేసులు నమోదయ్యాయి. తన ఇంటిపైకి వచ్చి దాడి చేశారని కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు. గత మూడ్రోజుల నుంచి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.