Loading...
Jharkhand: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురు మృతి
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురు మృతి

Jharkhand: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ లారీ రోడ్డుపై గుమిగూడిన ప్రజలపైకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఖుంటి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖుంటి జిల్లాలోని తోర్పా రోడ్డుపై బార్టోలి ప్రాంతంలో ఓ స్కూటీ ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు, ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేసేందుకు స్థానికులు రోడ్డుపై గుమిగూడారు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి అక్కడున్న ప్రజలపైకి దూసుకెళ్లింది.

వివరాలు 

పరారీలో డ్రైవర్.. పోలీసులు కేసు నమోదు

ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాయపడిన వారిని చికిత్స కోసం ఖుంటి సదర్ ఆసుపత్రికి తరలించారు.

మృతులను పాకో దేవి, కసిలా దేవి, మన్హు దేవి, గోలు కుమార్, అంజలి కుమారి, తూటీ కుమారి, సౌరభ్ నాయక్‌గా గుర్తించారు.

అయితే, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

ADVERTISEMENT