Loading...
Anti-SIR march: ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ.. దిల్లీలో ఉద్రిక్తత
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ.. దిల్లీలో ఉద్రిక్తత

Anti-SIR march: ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ.. దిల్లీలో ఉద్రిక్తత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా దిల్లీలో చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కార్యాలయం లక్ష్యంగా దిల్లీ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, బ్యానర్లు చేతబట్టి ఈసీఐ కార్యాలయం వైపు కదిలారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ముందుకు వెళ్లకుండా నిలువరించడంతో నిరసనకారులు రోడ్డుపైనే బైఠాయించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

వివరాలు 

ఆందోళనల్లో విద్యార్థులు, యువకులు, రైతులు

ఈ ఆందోళనల్లో విద్యార్థులు, యువకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీపీఎం సీనియర్‌ నాయకురాలు బృందా కారాట్‌తోపాటు ఆల్‌ ఇండియా డెమొక్రాటిక్‌ విమెన్స్‌ అసోసియేషన్‌, ఆల్‌ ఇండియా డెమొక్రాటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు నిరసనకు మద్దతు తెలిపారు.

దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు.

నిరసనల నేపథ్యంలో సెంట్రల్‌ దిల్లీలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

పరిస్థితులను అదుపులో ఉంచేందుకు రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) దళాలను రంగంలోకి దించారు.

ADVERTISEMENT