Rapaka Varaprasad: వైసీపీలో అవమానం.. పార్టీని వీడేందుకు సిద్ధమైన రాపాక వరప్రసాద్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
అప్పటి నుంచి రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు.
కత్తిమండల నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగనని ఆయన స్పష్టం చేశారు.
తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, కానీ వైసీపీ తనకు అవమానం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజోలులో కష్టపడినప్పటికీ, తనకు టికెట్ ఇవ్వకపోవడం ఇవ్వలేదు. గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇవ్వడం బాధించిందని, కావున పెద్దల సూచన మేరకు ఎంపీగా పోటీ చేశానని ఆయన వెల్లడించారు.
Details
జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు!
వరప్రసాద్ త్వరలోనే మరో పార్టీలో చేరుతానని ప్రకటించారు, అయితే ఏ పార్టీలో చేరతారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.
సమాచారం ప్రకారం, ఆయన జనసేన పార్టీలో తిరిగి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే, స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 2019లో రాపాక వరప్రసాద్ జనసేన తరఫున రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన, జనసేనకు సంబంధించి చేసిన విమర్శల వల్ల అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Details
జనసేన సమావేశానికి హాజరైన రాపాక
తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో జరిగిన జనసేన సమావేశంలో రాపాక వరప్రసాద్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
రాపాక పార్టీ వేదికపై కనిపించడం ద్వారా జనసేన కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇక రాజోలు జనసేనలో రాపాకకు తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మీద స్థానిక జనసేన ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ స్పందించారు.
మలికిపురంలో కాలేజీ లెక్చరర్ల అంశంపై రాపాక మాట్లాడారని, అయితే రాజకీయ అంశాలు ఏమీ చర్చించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.