Sharad Pawar: శరద్ పవార్‌కు అస్వస్థత.. పుణే ఆసుపత్రిలో చేరిక
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 22, 2026
11:42 am
ఈ వార్తాకథనం ఏంటి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌కు తరలించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల తీవ్రమైన దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన పవార్‌ను వారం క్రితం వైద్యులు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో మరోసారి ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. పవార్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు.