LOADING...
Bomb Treat : షార్జా-హైదరాబాద్ విమానంకు బాంబు బెదిరింపు..!
షార్జా-హైదరాబాద్ విమానంకు బాంబు బెదిరింపు..!

Bomb Treat : షార్జా-హైదరాబాద్ విమానంకు బాంబు బెదిరింపు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఈ సమాచారాన్ని విమానానికి సంబంధించిన అధికారులకు ఈ-మెయిల్ ద్వారా అందింది. విమానంలో "మానవ ఐఈడీ (IED)" ఉన్నట్లుగా ఈ మెయిల్ ద్వారా బెదిరించినట్లు తెలిసింది. బెదిరింపు రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ వార్తతో ప్రయాణికులు, విమానాశ్రయ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏ విధమైన ప్రమాదం రాకుండా, అధికారులు తక్షణమే జాగ్రత్తలు తీసుకొని, విమానాన్ని దాని అసలు గమ్యస్థానం హైదరాబాద్‌కు కాకుండా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ కు మళ్లించారు. అహ్మదాబాద్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే, సిబ్బంది,ప్రయాణికులను సురక్షితంగా విమానం నుండి దించారు.

వివరాలు 

కువైట్-హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్స్  

అనంతరం భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్‌తో కలిసి విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండవసారి. కొద్ది రోజుల క్రితం, కువైట్ నుండి హైదరాబాద్‌కి రాబోయే మరో ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ విమానాన్ని ఉదయం సుమారు 7:45 గంటలకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయగా, అక్కడ కూడా ప్రయాణికులను సురక్షితంగా దింపి, బాంబు డిస్పోజల్ బృందాలు విమానంలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి.

Advertisement