LOADING...
YS Sharmila: రాహుల్‌ గాంధీతో షర్మిల భేటీ.. రాజ్యసభ సీటుపై చర్చ జరిగిందా?
రాహుల్‌ గాంధీతో షర్మిల భేటీ.. రాజ్యసభ సీటుపై చర్చ జరిగిందా?

YS Sharmila: రాహుల్‌ గాంధీతో షర్మిల భేటీ.. రాజ్యసభ సీటుపై చర్చ జరిగిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2026
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. దిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు. ఇటీవల షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె రాహుల్‌ గాంధీతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు

పలు కీలక అంశాలపై చర్చ

ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై రాహుల్‌ గాంధీ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం షర్మిల 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా రాహుల్‌ గాంధీ విలువైన సూచనలు చేశారని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

Advertisement