PM Modi: సోమనాథ్‌లో శౌర్యయాత్ర.. మోదీ కాన్వాయ్‌కు 108 అశ్వాల ఎస్కార్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవుడి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో భాగంగా నిర్వహించిన శౌర్యయాత్రలో మోదీ పాల్గొన్నారు. ఈ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విదేశీ దురాక్రమణదారుల నుంచి సోమనాథ్ ఆలయాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన వీరయోధుల స్మారకంగా ఈ శౌర్యయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ఆ యోధులకు ఘన నివాళులు అర్పించారు.
Details
ప్రధానికి ఘన స్వాగతం
భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు చేస్తూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా 108 అశ్వాలు నిలిచాయి. శౌర్యయాత్ర కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ అశ్వాలు, ఆలయం వైపు వెళ్తున్న ప్రధానికి ఎస్కార్ట్‌లా ముందుకు సాగడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ప్రధాని సోమనాథ్ ఆలయానికి చేరుకుని మహాదేవుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.