LOADING...
Neelam Devi: బిహార్‌లో ధనిక ఎమ్మెల్యే ఆమెనే!

Neelam Devi: బిహార్‌లో ధనిక ఎమ్మెల్యే ఆమెనే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2025
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయిన వెంటనే ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు వ్యూహాలను చర్చిస్తూ చురకగా సిద్ధమయ్యాయి. సీట్ల లెక్కలు, ప్రచార పర్వంపై అధికార, విపక్ష కూటమీలలో నిరంతర చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రస్తుత ఎమ్మెల్యేలపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. 2020 ఎన్నికలు, తర్వాతి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ రిపోర్ట్ సిద్ధం చేసింది. రూ. 1,121 కోట్ల ఆస్తులు ప్రస్తుత ఎమ్మెల్యేలలో 194 మంది (80%) కోటీశ్వరులు. మొత్తం 241 ఎమ్మెల్యేల ఆస్తుల విలువ దాదాపు రూ. 1,121.6 కోట్లుగా ఉంది. పార్టీ వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

Details

సంపన్నుల వివరాలివే

బీజేపీ: 72 మంది (87% సంపన్నులు) క‌మ‌లం పార్టీ: 83 మంది ఆర్జేడీ: 72 మంది ఎమ్మెల్యేలు, వీరిలో 63 మంది (88%) కోటీశ్వరులు జేడీయూ: 47 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది (83%) సంపన్నులు కాంగ్రెస్: 17 మంది, వీరిలో 13 మంది (76%) కోటీశ్వరులు హిందూస్తానీ అవామీ మోర్చా (సెక్యులర్): 4 మంది, వీరిలో 2 మంది (50%) సంపన్నులు సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్): ఒక్కొక్కరు కోటీశ్వరులు స్వతంత్ర ఎమ్మెల్యేలు: 2 మంది, ఇద్దరు కూడా కోటీశ్వరులే కావు సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ. 4.7 కోట్లగా అంచనా వేసింది.

Details

అత్యంత సంపన్న ఎమ్మెల్యే: నీలం దేవి 

బిహార్‌లో అత్యంత సంపన్న శాసనసభ్యుల జాబితాలో జేడీయూ ఎమ్మెల్యే నీలం దేవి అగ్రస్థానంలో నిలిచారు. 2022 ఉప ఎన్నికల్లో మోకామా నియోజకవర్గం నుంచి గెలిచిన ఆమెకు రూ. 80 కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయి. వీటిలో చరాస్తులు రూ. 29.8 కోట్లు, స్థిరాస్తులు రూ. 50.6 కోట్లు. రెండో స్థానంలో గయ జిల్లాకు చెందిన జేడీయూ ఎమ్మెల్యే మనోరమా దేవి, ఆస్తుల విలువ రూ. 72.8 కోట్లు. మూడో స్థానంలో భాగల్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ, ఆస్తుల విలువ రూ. 43.2 కోట్లు.

Details

నిరుపేద ఎమ్మెల్యే: రామ్‌వృక్ష సదా

ఖగారియా జిల్లాలోని అలౌలి (SC) ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్‌వృక్ష సదా అత్యంత పేద ఎమ్మెల్యే. మొత్తం ఆస్తులు కేవలం రూ. 70,000 మాత్రమే, అందులో చరాస్తులు రూ. 30,000, స్థిరాస్తులు రూ. 40,000. ఫుల్వారీ (SC) నియోజకవర్గంలోని CPI(ML) గోపాల్ రవిదాస్ ఆస్తులు రూ. 1.59 లక్షలు, పాలిగంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సందీప్ సౌరవ్ ఆస్తులు రూ. 3.45 లక్షలు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో నవంబర్ 6, 11న జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న ప్రకటిస్తారు.