
అమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
ఈ వార్తాకథనం ఏంటి
'ఆర్5 జోన్' విషయంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులకు దాఖలు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంత భూములను స్థానికేతరులు, అల్పాదాయ వర్గాలకు పంచేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని అమరావతి రైతులు హైకోర్టును వెళ్లగా, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అమరావతి రైతులు స్పెషల్ లీవ్ పిటిషన్లు (ఎస్‌ఎల్‌పి)తో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు
అమరావతి రాజధాని పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనానికి పిటిషన్లు బదలీ
అమరావతి రైతుల పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది.
అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లను అమరావతి రాజధాని అంశంపై పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనానికి బదిలీ చేస్తూ జస్టిస్ అభయ్, జస్టిస్ రాజేష్‌తో కూడిన డివిజన్ బెంచ్ నిర్ణయించింది.
అమరావతి రైతుల పిటిషన్లను వచ్చే శుక్రవారం లోపు జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని బెంచ్ ముందు జాబితా చేయాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది.
అమరావతి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్‌ను మరో బెంచ్ పరిశీలిస్తున్నప్పుడు, సంబంధిత పిటిషన్‌ను చేపట్టడం సరికాదని డివిజన్ బెంచ్ భావించింది.