Page Loader
Sukhbir Singh Badal: సీఏడీ పార్టీకి షాక్‌.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా
సీఏడీ పార్టీకి షాక్‌.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా

Sukhbir Singh Badal: సీఏడీ పార్టీకి షాక్‌.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2024
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడిగా సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సమాచారాన్ని ఆ పార్టీ ప్రతినిధి డాక్టర్ దల్జీత్ సింగ్ చీమా అధికారికంగా ధ్రువీకరించారు. ఇటీవల సిక్కు మత పెద్దలు సుఖ్‌బీర్‌ను 'టంకయ్య'గా ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. సిక్కు మత ఆచారాలను ఉల్లంఘించినవారిని 'టంకయ్య'గా పిలుస్తారు. అలాంటి ఘటనల నేపథ్యంలో మతపరమైన శిక్ష విధించే అవకాశం లేకపోలేదు. ఇటీవల సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కుడి పాదానికి శస్త్రచికిత్స జరిగింది.

Details

కొత్త అధ్యక్షుడి నియామకానికి మార్గం సుగమం

ఈ క్రమంలో ఆయన పార్టీ వర్కింగ్ కమిటీకి తన రాజీనామాను సమర్పించారు. ఈ విషయాన్ని ప్రతినిధి దల్జీత్ సింగ్ వెల్లడించారు. తద్వారా శిరోమణి అకాలీ దళ్ కొత్త అధ్యక్షుడి నియామకానికి మార్గం సుగమమైంది. తన నాయకత్వంపై నమ్మకం ఉంచిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు సుఖ్‌బీర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన పార్టీ ప్రతినిధుల ద్వారా తన కృతజ్ఞతలు తెలియజేశారు.