తదుపరి వార్తా కథనం
America: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 20, 2025
10:53 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో వాషింగ్టన్ ఏవ్ లో జరిగిన కాల్పుల్లో ఒక తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన సమయంలో, హైదరాబాద్ కు చెందిన రవితేజ మరణించారు.
రవితేజ, చైతన్య పురి పరిధిలోని అర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెం. 2 లో నివసిస్తున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు.
2022 మార్చి నెలలో రవితేజ అమెరికాకు వెళ్లి, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
రవితేజ మరణం వల్ల అర్కేపురంలో వారి ఇంటి చుట్టూ విషాదం అలముకుంది. రవితేజ మృతి,కాల్పులకు గురించి ఇంకా పూర్తి సమాచారం పొందాల్సి ఉంది.