Sikkim floods:16 మంది విదేశీ పౌరులతో సహా 176 మంది పౌరులను రక్షించాం: IAF
16 మంది విదేశీ పౌరులతో సహా 176 మంది పౌరులను తరలించినట్లు భారత వైమానిక దళం తెలిపింది. భారత వైమానిక దళం రాష్ట్రంలో 9400 కిలోల రిలీఫ్ మెటీరియల్‌ను కూడా ఎయిర్‌ల్యాండింగ్ చేసిందని ఒక అధికారి తెలిపారు. భారత వైమానిక దళం అధికారుల వివరాల ప్రకారం.. వరదల బారిన పడిన సిక్కింలో సుదూర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు, ఆగిపోయిన ప్రాంతాలకు అవసరమైన సామాగ్రిని తరలించేందుకు భారత వైమానిక దళం తన Mi-17 V5,CH-47 చినూక్స్,చీతా హెలికాప్టర్‌లను ఏర్పాటు చేసింది.
లాచెన్ గ్రామంలో చిక్కుకుపోయిన పర్యాటకులు
ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో సంభవించిన విపత్తు,సిక్కిం,ఉత్తర బెంగాల్‌లోని తీస్తా బేసిన్‌లో విధ్వంసం సృష్టించిన దక్షిణ లొనాక్ సరస్సులోని గ్లేసియల్ లేక్ ఔట్‌బర్స్ట్ ఫ్లడ్ (GLOF) తరువాత, మొత్తం 523 మంది పర్యాటకులు లాచెన్ గ్రామంలో చిక్కుకుపోగా,ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని మంగళవారం ఒక అధికారి తెలిపారు. ఈ సందర్భంగా లాచెన్ (మంగన్) నియోజకవర్గ ఎమ్మెల్యే సందుప్ లెప్చా మాట్లాడుతూ.. లాచెన్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ఈ విపత్తులో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, మిగిలిన వారు క్షేమంగా ఉన్నారని అన్నారు. రహదారి డిస్‌కనెక్ట్ అయ్యిన కారణంగా తాము అక్కడి కి వెళ్లలేకపోయామని తెలిపారు. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, చాలా మంది సైన్యం సహాయంతో విమానంలో రక్షించబడ్డారని తెలిపారు.