Loading...
J&K: నిషేధిత సంస్థతో లింకులు.. బందిపోరాలో ఆరుగురు అరెస్ట్
నిషేధిత సంస్థతో లింకులు.. బందిపోరాలో ఆరుగురు అరెస్ట్

J&K: నిషేధిత సంస్థతో లింకులు.. బందిపోరాలో ఆరుగురు అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర కశ్మీర్ బందిపోరా జిల్లాలో నిషేధిత సంస్థ ఇత్తిహాద్‌-ఉల్‌-ముస్లిమీన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థకు సరిహద్దు అవతలి నుంచి నిధులు అందుతున్నాయనే అనుమానంతో పాటు, వేర్పాటువాద ప్రచారం, జైళ్లలో పరిచయాల ద్వారా నెట్‌వర్క్‌ను విస్తరించారనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బందిపోరా పోలీస్‌స్టేషన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని 10, 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు.

వివరాలు 

జైల్లో పాక్‌ వ్యక్తితో పరిచయం.. విడుదలయ్యాక రహస్య సమావేశాలు

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ దర్యాప్తు కుప్వారా జిల్లాలోని హంద్వారాకు చెందిన వహీద్ అహ్మద్ భట్‌తో మొదలైంది.

2022లో జరిగిన ఓ సమావేశం తర్వాత నమోదైన UAPA కేసులో అతడిని గతంలో అరెస్ట్ చేశారు.

కుప్వారా జైలులో ఉన్న సమయంలో పాకిస్థాన్‌కు చెందిన మంజూర్ అహ్మద్ షాతో మళ్లీ సంబంధాలు ఏర్పరచుకున్నట్లు భట్‌పై ఆరోపణలు ఉన్నాయి.

అనంతరం ఈ నెట్‌వర్క్ తమ భావజాలాన్ని ప్రచారం చేయడం, మద్దతు కూడగట్టేందుకు సమావేశాలు నిర్వహించడంపై దృష్టి పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ కార్యకలాపాల్లో కొందరు మహిళలు కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

2024 ఆగస్టులో వైద్య కారణాలతో భట్ విడుదలైన తర్వాత బందిపోరా,పరిసర ప్రాంతాల్లో సుమారు 14 నుంచి 15రహస్య సమావేశాలు నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాలు 

రూ.8 లక్షల అనుమానాస్పద లావాదేవీలు.. నిధులపై పోలీసుల ఆరా

వీటిలో ఐదు నుంచి ఆరు సమావేశాలు బందిపోరా-బారాముల్లా మార్గంలోని ఓ చిన్న హోటల్‌లో జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.

ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు గుర్తించారు.

ఏడాదికి పైగా కాలంలో సుమారు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఈ నెట్‌వర్క్‌కు చేరినట్లు అనుమానిస్తున్నారు.

ఇందులో దాదాపు రూ.2.26 లక్షలను బందిపోరా జిల్లాలోని డాచిగామ్‌కు చెందిన ముబీనా బానూ జమ్మూకశ్మీర్ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మిగిలిన మొత్తాన్ని నగదు తీసుకెళ్లే వ్యక్తుల ద్వారా అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ డబ్బులో కొంత మొత్తాన్ని ఇతర సహచరులకు పంచగా, మరికొంత భట్ వైద్య చికిత్సకు వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

నగదు రవాణాదారుల పాత్రపై దర్యాప్తు

ఈ కేసులో ముబీనా బానూ, వహీద్ అహ్మద్ భట్, ఖుష్బూ జాన్, మెహక్ జాన్, అలియా జాన్, ఇర్ఫాన్ అహ్మద్ రేషీ అలియాస్ రయీస్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కుప్వారాకు చెందిన ఇద్దరు అనుమానిత నగదు రవాణాదారులతో పాటు ఓ మతపెద్ద ప్రమేయం కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.

వారి పాత్రతో పాటు నిధుల లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నెట్‌వర్క్ కార్యకలాపాల పూర్తి స్థాయిని గుర్తించడం, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నిర్ధారించడం, ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కరి పాత్రను తేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ADVERTISEMENT