Page Loader
Covid 19: నెల్లూరులో కరోనా డేంజర్ బెల్స్ .. ఒకేసారి ఆరు కేసులు
నెల్లూరులో కరోనా డేంజర్ బెల్స్ .. ఒకేసారి ఆరు కేసులు

Covid 19: నెల్లూరులో కరోనా డేంజర్ బెల్స్ .. ఒకేసారి ఆరు కేసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దగ్గు, జలుబు లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన కొంతమందికి వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఒక్కసారిగా ఆరుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, ఈ బాధితుల్లో ఐదుగురిలో తీవ్ర లక్షణాలు లేనందున, వారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. ఒకరిని మాత్రం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేరదీసి వైద్యం అందిస్తున్నారు. ఒకేసారి ఆరుగురికి కోవిడ్ సోకడంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సకు ప్రత్యేకంగా పల్మనాలజీ విభాగంలో ప్రత్యేక వార్డు ఏర్పాటైంది. మహిళలు, పురుషులకు వేరువేరు వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

కేరళ నుంచి వచ్చిన నర్సింగ్ విద్యార్థినికి కోవిడ్ లక్షణాలు

ఇదే సమయంలో, కేరళ నుంచి నెల్లూరుకు వచ్చిన ఓ నర్సింగ్ విద్యార్థినికి కోవిడ్ లక్షణాలు కనిపించాయి. ఆమెకు హోమ్ ఐసోలేషన్‌లోనే వైద్యం అందిస్తున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త కేసులు వరుసగా నమోదు అవుతున్నాయి. నిర్లక్ష్యం చేయరాదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.