Himachal Pradesh: అనర్హత వేటుపై హైకోర్టుకు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా గురువారం ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఆ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించనున్నారు. తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్‌పాల్, చెతన్య శర్మ, దేవిందర్ కుమార్ భుట్టో ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక బిల్లుపై ఓటింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా పార్టీ విప్‌ను ధిక్కరించారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించారనే కారణంతో వారిపై అనర్హత వేటు వేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌ను కోరింది. దీంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు.