Kodad: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న బస్సు.. ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
🚨Sensitive Content
— Telugu Feed (@Telugufeedsite) August 26, 2026
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆరుగురు మృతి.. 23 మందికి తీవ్ర గాయాలు.. ఏడుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న అభి ట్రావెల్స్ బస్సు
కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఐరన్ లోడ్లో వెళ్తూ డివైడర్ను ఢీకొట్టిన లారీ
అందులో ఉన్న ఐరన్ రాడ్లు… pic.twitter.com/8ANdeQ1gvz