LOADING...
UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. ఆరుగురు మహిళలు మృతి 
ఆరుగురు మహిళలు మృతి

UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. ఆరుగురు మహిళలు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో దారుణ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో, అకస్మాత్తుగా మరో రైలు వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం — మీర్జాపూర్‌లోని చునార్ జంక్షన్‌ వద్ద చోపాన్-ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నుంచి కొందరు ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌కు వెళ్లకుండా నేరుగా పట్టాలపైకి దిగారు. తరువాత పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుండగా, హౌరా-కల్కా నెటాజీ ఎక్స్‌ప్రెస్ వేగంగా అక్కడికి చేరి వారిని ఢీకొట్టింది. రైలు స్పీడ్ ఎక్కువగా ఉండటంతో ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయాలపాలయ్యారు.

వివరాలు 

తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 

ప్లాట్‌ఫామ్‌లో కాకుండా నేరుగా పట్టాలపైకి దిగడమే ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సహాయక, రక్షణ చర్యలను వేగవంతం చేయాలని కూడా ఆయన సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూపీలో ఘోర ప్రమాదం