
Kodali Nani: కోల్కతాలో కొడాలి నానిని అరెస్ట్ చేశారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు..
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కేసులలో అరెస్టు అవుతున్న నేపథ్యంలో, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిని కూడా అరెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వేగంగా వ్యాపించాయి.
ఆయనను కోల్కతాలో అరెస్టు చేశారంటూ కొన్ని వదంతులు హల్చల్ చేశాయి.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తేల్చిచెప్పారు.
కొడాలి నాని అరెస్ట్ గురించి సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న సమాచారాన్ని అవాస్తవం,. గతంలో ఆయనపై నమోదైన కేసులు ఉన్న నేపథ్యంలో కోల్కతా ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు అన్న వార్త పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు.
వివరాలు
కొడాలి నానిని నిజంగా అరెస్ట్ చేస్తే..
కొడాలి నానిని నిజంగా అరెస్ట్ చేస్తే, ఆ వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని ఎస్పీ గంగాధరరావు చెప్పారు.
నిరాధారమైన వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, షేర్ చేయడం నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
ఇలాంటి వదంతుల ప్రచారంలో పాలుపంచుకునే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరికైనా మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు ఎస్పీ గంగాధరరావు.