తదుపరి వార్తా కథనం

Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు
వ్రాసిన వారు
Stalin
Dec 09, 2023
11:45 am
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శనివారం పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోనియా గాంధీ 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 78 కిలోల కేక్‌ను కాంగెస్ సీనియర్ నేత వీహెచ్ కట్ చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సోనియా గాంధీ పుట్టిన రోజు కేక్‌ను కట్ చేసే అర్హత కేవలం వీహెచ్ కు మాత్రమే ఉందన్నారు.
సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా 6 గ్యారంటీల్లో రెండింటిని ప్రారంభించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కష్టంతోనే అధికారంలోకి వచ్చామన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోనియా గాంధీ పుట్టిన రోజు స్పెషల్ కేక్
గాంధీ భవన్ లో సోనియా బర్త్ డే కేక్ pic.twitter.com/mTH07RU6rW
— V6 News (@V6News) December 9, 2023