Loading...
Sonia Gandhi: రెస్టారెంట్‌లో మొదలై...భారత దేశం వరకు...సోనియా ప్రేమకథ
రెస్టారెంట్‌లో మొదలై...భారత దేశం వరకు...సోనియా ప్రేమకథ

Sonia Gandhi: రెస్టారెంట్‌లో మొదలై...భారత దేశం వరకు...సోనియా ప్రేమకథ

వ్రాసిన వారు Balachander Sharma
Oct 24, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌లోని ఓ చిన్న గ్రీకు రెస్టారెంట్‌లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారి, భారత రాజకీయ చరిత్రలో కీలకమైన కుటుంబ బంధంగా నిలిచింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సోనియా గాంధీ తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీతో తొలి పరిచయం, ప్రేమ జ్ఞాపకాలను తాజాగా పంచుకున్నారు. దశాబ్దాల క్రితం జరిగిన ఆ సంఘటనను ఇప్పటికీ మధురంగా గుర్తు చేసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

Details

బిలాంగింగ్‌ ఏ జర్నీ ఆఫ్‌ లవ్

సోనియా గాంధీ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' పుస్తక పరిచయ వీడియోలో ఈ విషయాలను వెల్లడించారు.

ఈ పుస్తకం నవంబర్‌ 10, 2026న విడుదల కానుంది.

ఇందులో తన చిన్ననాటి ఇటలీ జీవితం నుంచి రాజీవ్‌తో పరిచయం, వివాహం, కుటుంబ అనుబంధం, రాజకీయ ప్రయాణం వరకు పలు అంశాలను ఆమె వివరించనున్నారు.

Details

తొలి చూపులోనే ప్రత్యేకమైన అనుబంధం

కేంబ్రిడ్జ్‌లోని 'వర్సిటీ రెస్టారెంట్‌' అనే గ్రీకు హోటల్‌లో ఓ స్నేహితుడి ద్వారా రాజీవ్‌ గాంధీ పరిచయమయ్యారని సోనియా గుర్తు చేసుకున్నారు.

మొదటిసారి ఆయనను చూసినప్పుడే కలిసి జీవించాలనే భావన తనలో కలిగిందని చెప్పారు. తనకు కూడా అలాంటి భావనే కలిగిందని రాజీవ్‌ తర్వాత చెప్పినట్లు వెల్లడించారు.

రాజీవ్‌లోని సౌమ్యత, మృదువైన వ్యక్తిత్వం తనను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని సోనియా తెలిపారు.

ఆ తొలి పరిచయం క్రమంగా ప్రేమగా మారి, జీవితాంతం నిలిచిన అనుబంధానికి పునాది వేసిందని ఆమె జ్ఞాపకాలను పంచుకున్నారు.

ADVERTISEMENT

Details

వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలు

సోనియా గాంధీ ఇప్పటివరకు తన వ్యక్తిగత జీవితాన్ని చాలా పరిమితంగానే బహిరంగంగా పంచుకున్నారు.

అయితే ఈ పుస్తకం ద్వారా తన జీవితంలోని ఎన్నో అనుభవాలను పాఠకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీల హత్యలతో సహా తన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన విషాదాలను కూడా ఇందులో ప్రస్తావించనున్నారు.

ప్రేమ, కుటుంబం, రాజకీయ బాధ్యతలు, వ్యక్తిగత నష్టాలు.. ఇలా సోనియా జీవితంలోని విభిన్న కోణాలను ఆవిష్కరించనున్న ఈ పుస్తకంపై ఆసక్తి నెలకొంది.

రాజీవ్‌తో తన అనుబంధాన్ని ఆమె ఎలా గుర్తు చేసుకున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT