Sonia gandhi: 'మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి: తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం
నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రజల కోసం సోనియా ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేసారు. మార్పు కోసం, కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని సోనియా చెప్పారు. తెలంగాణలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి స్పష్టం చేశారు. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలని సోనియా పిలుపునిచ్చారు. తనను తల్లిలా చూసుకున్నారని, మీ ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని సోనియా పేర్కొన్నారు. తెలంగాణలోని సోదరీమణులు, తల్లులు, కొడుకులు, కుమార్తెలు ఈసారి మార్పు తీసుకురావాలని సోనియా తన వీడియో సందేశంలో కోరారు.