Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం జైపూర్‌లో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు సోనియా గాంధీ జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కూడా సోనియా వెంట ఉన్నారు. జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోటసార, ప్రతిపక్ష నేత టికారాం జూలీ సోనియా గాంధీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత నేరుగా వెళ్లి.. సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈసారి పోటీ చేసేందుకు మన్మోహన్ సింగ్ నిరాకరించారు. దీంతో ఆయన స్థానంలో సోనియాను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పార్టీ పంపుతోంది.