BJP: సోనియా పుస్తకానికి 'తప్పులను కప్పిపుచ్చడం' అని పేరు పెట్టాల్సింది: భాజపా
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని సమర్థించుకునేందుకు సోనియా ప్రయత్నించారని ఆరోపించింది. ఈ పుస్తకానికి 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' అనే పేరుకు బదులుగా 'తప్పులను కప్పిపుచ్చడం' అని పేరు పెట్టాల్సిందని భాజపా జాతీయ కార్యదర్శి సీఆర్ కేశవన్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ, ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేసిన ఎమర్జెన్సీని సమర్థించడం దిగ్భ్రాంతికరమని ఆయన పేర్కొన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం చేసిన చారిత్రక తప్పిదాలకు మంచితనం అనే రంగు పులమడమే ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని విమర్శించారు.
వివరాలు
1984 సిక్కుల మారణకాండపై సోనియా గాంధీ ఏంటి?
1984 సిక్కుల మారణకాండపై సోనియా గాంధీ వైఖరిని కూడా కేశవన్ ప్రశ్నించారు.
''బాబ్రీ మసీదు కోసం తాను కన్నీళ్లు పెట్టుకున్నానని సోనియా చెబుతున్నారు. మరి కాంగ్రెస్ పాలనలో 1984లో జరిగిన సిక్కుల ఊచకోత సమయంలో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గురుద్వారాలపై దాడులు జరిగాయి. ఆ సమయంలో సోనియా ఒక్క కన్నీటి చుక్కైనా కార్చారా?'' అని ప్రశ్నించారు.
బట్లా హౌస్ ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదుల కోసం సోనియా వెక్కి వెక్కి ఏడ్చారని ఆరోపించిన కేశవన్.. దేశాన్ని, ప్రజలను కాపాడే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కోసం ఆమె ఎప్పుడైనా కన్నీరు పెట్టుకున్నారా? అని నిలదీశారు.
వివరాలు
2008లో జరిగిన 26/11 ముంబయి ఉగ్రదాడిపై సోనియా స్పందన ఏమిటి?
2008లో జరిగిన 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు సోనియా స్పందన ఏమిటని ప్రశ్నించారు.
అలాంటి దాడులకు పాల్పడిన వారిపై అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎందుకు ప్రతీకార చర్యలు తీసుకోలేకపోయిందో ఆమె ఆత్మకథలో వివరిస్తారా? అని నిలదీశారు.
దాదాపు 55 ఏళ్లపాటు కేంద్రంలో కొనసాగిన కాంగ్రెస్ పాలన భారత రాజకీయ వ్యవస్థతో పాటు ప్రజాస్వామ్యానికి తీరని నష్టం కలిగించిందని సీఆర్ కేశవన్ విమర్శించారు.
కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దేందుకు సమర్థంగా కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.