Special Trains : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు.. తేదీలు, ప్రారంభ సమయాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగల వేళ ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుందన్న అంచనాలతో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపడానికి కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. హైదరాబాద్‌లో నివసిస్తూ పండగల కోసం స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు రైల్వే స్టేషన్ల మీదుగా ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
వివరాలు
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన దక్షిణమధ్య రైల్వే అధికారులు
ఈ నెల 24 నుంచి 30 వరకు చర్లపల్లి నుంచి కాకినాడ టౌన్‌కు (ట్రైన్ నంబర్ 07196) ప్రతి మంగళ, బుధవారాల్లో సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరి,మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటాయి. అలాగే 28 నుంచి 31 తేదీల వరకు కాకినాడ టౌన్ నుంచి చర్లపల్లికి (ట్రైన్ నంబర్ 07195)ప్రతి ఆదివారం,బుధవారాల్లో సాయంత్రం 7.30 గంటలకు ప్రయాణం ప్రారంభమై,మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటాయని అధికారులు వివరించారు. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ,మిర్యాలగూడ,పిడుగురాళ్ల,సత్తెనపల్లి,గుంటూరు,విజయవాడ,గుడివాడ, కైకలూరు,ఆకివీడు,భీమవరం టౌన్,తణుకు,రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలియజేశారు. పండుగల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చుకునేందుకు ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దక్షిణమధ్య రైల్వే చేసిన ట్వీట్
Special Trains for #Christmas and #Newyear pic.twitter.com/YmRl4C0umE
— South Central Railway (@SCRailwayIndia) December 9, 2025