Pongal Special Trains: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
ఈ నెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.ప్రత్యేక రైళ్ల షెడ్యూల్,వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
రైలు నెం. 07055 - జనవరి 10వ తేదీన తిరుపతి నుంచి సికింద్రాబాద్
ఉదయం 8.25 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
రైలు నెం. 07056 - జనవరి 11వ తేదీ సికింద్రాబాద్ నుంచి కాకినాడ
రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 6.45 గంటలకు కాకినాడ చేరుతుంది.
Details
రైల్వే ప్రత్యేక రైళ్లు
రైలు నెం. 07057- జనవరి 12వ తేదీన కాకినాడ నుంచి సికింద్రాబాద్ వరకు
రాత్రి 9 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
రైలు నెం. 07071- జనవరి 13వ తేదీన సికింద్రాబాద్ నుంచి కాకినాడ వరకు
రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ బయల్దేరి మరునాడు ఉదయం 8.30 గంటలకు కాకినాడ చేరుతుంది.
Details
రైల్వే ప్రత్యేక రైళ్లు
రైలు నెం. 07072- జనవరి 14వ తేదీన కాకినాడ నుంచి తిరుపతికి
ఉదయం 10 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి ఆ రోజు రాత్రి 8.20 గంటలకు తిరుపతి చేరుతుంది.
రైలు నెం. 02707- జనవరి 15వ తేదీన తిరుపతి నుంచి కాచిగూడ వరకు
ఉదయం 5.30 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కాచిగూడ చేరుతుంది.