LOADING...
Telangana: అమృత్‌భారత్‌ ప్రాజెక్ట్ .. మరో రెండు నెలల్లో హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు
మరో రెండు నెలల్లో హఫీజ్‌పేట రైల్వేస్టేషన్

Telangana: అమృత్‌భారత్‌ ప్రాజెక్ట్ .. మరో రెండు నెలల్లో హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమృత్‌భారత్‌ ప్రాజెక్ట్‌ కింద నగరంలోని రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు వడివడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభించగా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు రాబోయే రెండు నెలల్లో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభించే లక్ష్యంతో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు చేపట్టిన పునరాభివృద్ధి పనుల 85 శాతం పూర్తయినట్లు సీపీఆర్‌వో శ్రీధర్‌ వెల్లడించారు. మిగిలిన 15 శాతం, దాదాపు 45 రోజుల్లో పూర్తికానుందని ఆయన తెలిపారు. హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, మలక్‌పేట్, మల్కాజిగిరి, ఉందానగర్, యాకుత్‌పురా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు గణనీయంగా వేగవంతం అవుతున్నాయి.

వివరాలు 

పునరాభివృద్ధి పనుల ప్రస్తుత స్థితి 

ప్లాట్‌ఫామ్ పైకప్పు, సర్క్యులేటింగ్‌ ఏరియా, స్టేషన్ భవన నిర్మాణం పనులు పూర్తయాయి. వెయిటింగ్‌హాల్‌ పునరుద్ధరణ, స్టేషన్‌ భవన మెరుగు పనులు తుదిదశలో ఉన్నాయి. ప్లాట్‌ఫామ్ ఉపరితల అభివృద్ధి, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. 12 మీటర్ల పొడవుగల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతోంది. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సూచిక బోర్డులు, టాయిలెట్ బ్లాక్‌లు, ముఖభాగం లైటింగ్ పనులు కూడా గణనీయంగా ముందుకు సాగుతున్నాయి. ప్రాజెక్ట్ వివరాలు: మొత్తం వ్యయం: రూ. 29.21 కోట్లు. వర్గీకరణ: సబర్బన్‌ గ్రేడ్-3. రోజువారీ సగటు ప్రయాణికులు: సుమారు 9,000 మంది. నిలిచే రైళ్లు: ఎంఎంటీఎస్‌లు - 60, ఎక్స్‌ప్రెస్‌ - 8.