Page Loader
Weekly Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. వేసవి సెలవుల దృష్ట్యా 52 ప్రత్యేక రైళ్లు
వేసవి సెలవుల దృష్ట్యా 52 ప్రత్యేక రైళ్లు

Weekly Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. వేసవి సెలవుల దృష్ట్యా 52 ప్రత్యేక రైళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. మొత్తం 52ప్రత్యేక రైలు సేవలను వివిధ స్టేషన్ల మధ్య నడపనున్నట్లు వెల్లడించింది.అందులో భాగంగా సీఎస్‌టీ ముంబయి - ఆదిలాబాద్‌ - సీఎస్‌టీ ముంబయి మార్గంలో 24 సర్వీసులు,ఎస్‌ఎంవీటీ బెంగళూరు - నారంగి - ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య 8 సర్వీసులు, హుబ్బళ్లి - కతిహార్‌ - హుబ్బళ్లి మధ్య 8 సర్వీసులు, హుబ్బళ్లి - బనారస్‌ - హుబ్బళ్లి మార్గంలో 12 సర్వీసులు ఈ వారాంతపు ప్రత్యేక రైళ్లుగా (Weekly Special Trains) నడవనున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ప్రజాసంబంధ అధికారుడు (సీపీఆర్‌వో) శ్రీధర్‌ వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.