
Andhra Pradesh: ఏపీలో టెక్స్‌టైల్ పరిశ్రమలకు ప్రత్యేక క్లస్టర్లు.. స్విస్, జర్మనీ సంస్థల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్విట్జర్లాండ్, జర్మనీలోని పర్యటనలో భాగంగా స్విస్ గార్మెంట్ పరిశ్రమ ఫుచ్స్ డిజైన్ ఏజీకి చెందిన నిర్వాహకులు ఒలివర్ ఫుచ్స్, ఫస్ట్‌జెన్ వ్యవస్థాపక సీఈవో ఫిలిప్ అస్మస్, అనేక ఇతర సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. విశాఖపట్టణంలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనాలని వారికి ఆయన ఆహ్వానం అందించారు.
వివరాలు
ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంస్థ ఆసక్తి
"రాష్ట్రంలో దుస్తుల పరిశ్రమ కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయబడ్డాయి. 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఆధునిక స్టార్టప్ ఇంక్యుబేటర్ల హబ్‌లుగా మార్చడానికి ఫస్ట్‌జెన్ సహకారం కోరాము. ఎంఎస్‌ఎంఈలకు ఆన్‌లైన్ ఎగుమతులపై శిక్షణ ఇవ్వడానికి ఎక్స్‌పోర్ట్ అకాడమీ బాటెడ్ వుర్టెంబర్గ్ అంగీకరించింది" అని వెల్లడించారు. అలాగే, నౌకా నిర్మాణం, గ్యాస్ అన్వేషణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్స్, ఆటోమోటివ్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం జర్మనీ ఆధారిత ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంస్థ ఆసక్తి చూపినట్లు మంత్రి వివరించారు.