తదుపరి వార్తా కథనం
Bhogapuram: దిల్లీ నుంచి ప్రత్యేక విమానం.. భోగాపురం విమానాశ్రయంలో మొదటి ల్యాండింగ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 04, 2026
11:18 am
ఈ వార్తాకథనం ఏంటి
విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్‌లో విజయవంతమైంది. ఆదివారం తొలి విమానం సజావుగా రన్‌వేపై దిగింది. దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితర ప్రముఖులు ప్రయాణించారు.