Loading...
AP: మోదీ ఏపీ పర్యటనకు ఏర్పాట్లు.. ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు
మోదీ ఏపీ పర్యటనకు ఏర్పాట్లు.. ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు

AP: మోదీ ఏపీ పర్యటనకు ఏర్పాట్లు.. ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌కు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరగేలా ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని పర్యటన సందర్భంగా పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర ప్రజా అవసరాలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ బాధ్యతలను నలుగురు ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. ఇందులో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్.ఎం. ధ్యాన చంద్ర, గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ ఉన్నారు.

వివరాలు 

అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి: ప్రభుత్వం

వీరికి సహాయంగా రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి 26 మంది నాన్-క్యాడర్ అధికారులను ప్రభుత్వం కేటాయించింది.

ఈ అధికారులు సంబంధిత ఏర్పాట్లను సమన్వయం చేస్తూ, విజయనగరం జిల్లా కలెక్టర్‌కు నివేదికలు సమర్పించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ప్రధాని పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా జరిగేలా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ADVERTISEMENT