Page Loader
Special Train: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. కాచిగూడ, కాజీపేట మీదుగా రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్లు..!
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త..

Special Train: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. కాచిగూడ, కాజీపేట మీదుగా రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్లు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్తను అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని కాచిగూడ, కాజీపేట రైల్వే స్టేషన్లను దాటే విధంగా, ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. యశ్వంత్‌పూర్‌ నుండి యోగ్ నగరి రిషికేశ్‌కు వెళ్లే ప్రత్యేక రైలు నంబర్‌ 06597 ప్రతి గురువారం అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఈరైలు గురువారం ఉదయం 7గంటలకు రిషికేశ్‌ నుంచి బయలుదేరి,ఆదివారం తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈమార్గంలో రైలు కాచిగూడలో రాత్రి 8:50 గంటలకు,కాజీపేట స్టేషన్లో రాత్రి 11:33 గంటలకు ఆగుతుందని అధికారులు వెల్లడించారు. అలాగే రిషికేశ్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కి తిరిగి వెళ్లే రైలు నంబర్‌ 06598 ప్రతి ఆదివారం నడుస్తుందని వెల్లడించారు. ఈరైలు ఆదివారం సాయంత్రం 5:55 గంటలకు రిషికేశ్‌ నుంచి బయలుదేరుతుంది.

వివరాలు 

కాచిగూడ, కాజీపేట మీదుగా రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్లు..!

ఈ రైలు యెలహంక జంక్షన్‌, హిందూపూర్‌, ధర్మవరం, అనంతపురం, డోన్‌, కర్నూల్ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్‌, భోపాల్‌, బినా జంక్షన్‌, ఝాన్సీ, గ్వాలియర్‌, ఆగ్రా కాంట్‌, మధుర, నిజాముద్దీన్‌, ఘజియాబాద్‌, మీరట్‌, ముజఫర్‌నగర్‌, తాప్రి, రూర్కీ, హరిద్వార్‌ స్టేషన్లలోనూ ఆగుతుందని స్పష్టం చేసింది. ఈ రైలులో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.