LOADING...
Guntur: 'స్క్రబ్ టైఫస్' బాధితులకోసం గుంటూరు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు
'స్క్రబ్ టైఫస్' బాధితులకోసం గుంటూరు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు

Guntur: 'స్క్రబ్ టైఫస్' బాధితులకోసం గుంటూరు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే 'స్క్రబ్ టైఫస్' వ్యాధి కారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్‌.ఎస్‌.వి. రమణ తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఇప్పటి వరకు జీజీహెచ్‌లో 8 కేసులు నమోదయ్యాయని, ఈ వ్యాధి ప్రాణానికి ముప్పు కలిగించదని స్పష్టం చేశారు. పలు బాధితులు పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి వచ్చుండటంతో, ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వారికి సమర్థమైన చికిత్స అందిస్తున్నామని కూడా తెలిపారు.

Advertisement