SpiceJet Staff: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ వేధింపులు..చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్‌జెట్
జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ స్క్రీనింగ్‌పై వాగ్వాదం తర్వాత స్పైస్‌జెట్ ఉద్యోగిని అనురాధ రాణి ..పురుష అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను చెంపదెబ్బ కొట్టారు. దీనిపై భారత న్యాయ సంహిత లోని పలు సెక్షన్ ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.ఈ ఘటన విమానాశ్రయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అసలు వివాదం ఎందుకు వచ్చిందంటే రన్ వే పైకి వెళ్లటానికి ప్రవేట్ ఎయిర్ వేస్ సిబ్బందికి ముందుగానే ఆ సంస్ధ జారీ చేస్తుంది. కానీ CISF అధికారుల వాదన ఇలా వుంది. అనురాధ రాణి ఉదయం 4 గంటలకు ఇతర సిబ్బందితో విమానాశ్రయంలోకి ప్రవేశించింది. అయితే గేటు ద్వారా ప్రవేశించడానికి సరైన అనుమతి లేదని అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ అభ్యంతరం తెలిపాడు
అసలు ఏమి జరిగిందంటే
అనురాధను సమీపంలోని ప్రవేశద్వారం వద్ద ఎయిర్‌లైన్ సిబ్బంది కోసం స్క్రీనింగ్ చేయమని అడిగాడు. కాని ఆ సమయంలో మహిళా CISF సిబ్బంది ఎవరూ అక్కడ లేరని వారు తెలిపారు. ఈ క్రమంలో ఏమి జరిగిందో తెలియదు కానీ అనురాధను తన ఇంటికి రమ్మని గిరిరాజ్ ప్రసాద్ కోరినట్లు ఆమె ఆరోపించారు. ఆ మాట అనగానే ఆగ్రహంతో ఆమె CISF అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ చెంప ఛెళ్లుమనిపించారు. అయితే అప్పటికే వాగ్వాదం పెరిగి మహిళా ఉద్యోగి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను కొట్టారని జైపూర్ విమానాశ్రయ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రామ్ లాల్ తెలిపారు. కాగా మహిళా ఉద్యోగినిపై "సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అనుచితమైన ఆమోదయోగ్యం కాని పదజాలం వాడారు.
మహిళా ఉద్యోగినికి అండగా వుంటాం స్పైస్‌జెట్
దీంతో ఆమె ఆగ్రహానికి లోనయ్యారని తెలిపారు. తన ఇంటి వద్ద డ్యూటీ ముగిసిన కలవమని కోరడాడని అని స్పైస్‌జెట్ ప్రతినిధి ఆరోపించింది. స్పైస్‌జెట్ తన మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో తక్షణమే చట్టపరమైన చర్యలు కంపెనీ తీసుకుంటుంది. ఆమె పోలీసులను ఆశ్రయించింది, తాము మా ఉద్యోగికి అండగా ఉంటాము . ఆమెకు పూర్తి సహాయాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని ప్రతినిధి తెలిపారు. మహిళా ఉద్యోగిపై పోలీసులు భారత న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్‌లు 121 (1) (ప్రభుత్వ ఉద్యోగిని తన విధుల నుండి నిరోధించడానికి స్వచ్ఛందంగా గాయపరచడం) , 132 (ప్రభుత్వ సేవకుడిపై దాడి చేయడం) కింద కేసు నమోదు చేశారు.