Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం… డ్రోన్ విజువల్స్
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం జలాశయం వరద నీటితో కాసి పోతున్న నేపథ్యంలో అధికారులు 10 గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ దృశ్యాలను చూపించే డ్రోన్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం భారీగా పెరగడంతో జాగ్రత్త చర్యగా గేట్లను ఎత్తినట్లు సమాచారం. శ్రీశైలం నుంచి విడుదలైన జలాలు వేగంగా నాగార్జునసాగర్ వైపు చేరుతున్నాయి. మరోవైపు జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం సుమారు 2,53,819 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీశైలం డ్యామ్ డ్రోన్ విజువల్స్
శ్రీశైలం డ్యామ్ డ్రోన్ విజువల్స్
— BIG TV Breaking News (@bigtvtelugu) August 19, 2025
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం
ప్రాజెక్ట్ 10 క్రెస్టు గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ
జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,53,819 క్యూసెక్కుల వరద… pic.twitter.com/elKC8j7q1V