Loading...
Srisailam: జూరాలకు 1.92 లక్షల క్యూసెక్కుల వరద.. వంద టీఎంసీలకు చేరువలో శ్రీశైలం
జూరాలకు 1.92 లక్షల క్యూసెక్కుల వరద.. వంద టీఎంసీలకు చేరువలో శ్రీశైలం

Srisailam: జూరాలకు 1.92 లక్షల క్యూసెక్కుల వరద.. వంద టీఎంసీలకు చేరువలో శ్రీశైలం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా,సోమవారం రాత్రి నాటికి నిల్వలు 93.58 టీఎంసీలకు చేరుకున్నాయి. ఇదే స్థాయిలో ప్రవాహం కొనసాగితే మంగళవారం నాటికి నిల్వలు 100 టీఎంసీల మార్కును చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక నుంచి నీటి విడుదల పెరగడంతో జూరాల జలాశయానికి ప్రస్తుతం 1.92 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. ఈ ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తి 1.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదనంగా జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 31 వేల క్యూసెక్కుల నీటిని కూడా దిగువకు వదులుతున్నారు.

వివరాలు 

నారాయణపూర్ జలాశయానికి 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

ఎగువ ప్రాంతంలోని ఆలమట్టి జలాశయానికి 1.36 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా, అక్కడి నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

అలాగే నారాయణపూర్ జలాశయానికి 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుండగా, దిగువకు 1.41 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల మరింత పెరిగిన నేపథ్యంలో మంగళవారం నాటికి జూరాల జలాశయానికి వచ్చే వరద ప్రవాహం ఇంకా అధికమయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

వివరాలు 

గోదావరిలో తగ్గిన ప్రవాహం

మరోవైపు గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 5 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది.

మేడిగడ్డ బ్యారేజీకి 2.30 లక్షల క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీ వద్ద 3.84 లక్షల క్యూసెక్కులు, భద్రాచలం ఎగువన ఉన్న సీతమ్మసాగర్ బ్యారేజీ వద్ద 7.12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

కొడంగల్‌లో అత్యధిక వర్షపాతం

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో 10.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 7.3 సెం.మీ., మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాప్రాలో 6.9 సెం.మీ., రంగారెడ్డి జిల్లా కొందుర్గులో 6.7 సెం.మీ., మనూరులో 6.4 సెం.మీ., వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో 5.4 సెం.మీ., నిర్మల్ జిల్లా సారంగాపూర్‌లో 5.3 సెం.మీ., మంచిర్యాల జిల్లా జన్నారంలో 4.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.

రాష్ట్రంలో మంగళవారం, బుధవారం కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ADVERTISEMENT