LOADING...
Telangana: మౌలిక సదుపాయాల్లో వెనుకబడిన వర్గాలు: సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలు
మౌలిక సదుపాయాల్లో వెనుకబడిన వర్గాలు: సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలు

Telangana: మౌలిక సదుపాయాల్లో వెనుకబడిన వర్గాలు: సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో సామాజిక వర్గాల మధ్య మౌలిక సదుపాయాల విషయంలో గణనీయమైన అసమానతలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఎస్టీ,ఎస్సీ,బీసీ వర్గాలు పలు అంశాల్లో వెనుకబడి ఉన్నాయని తేలింది. మరోవైపు ఓసీలు,బీసీ-సీ వర్గాలకు సమస్యలు తక్కువగా ఉన్నప్పటికీ, అద్దె ఇళ్లలో నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. గృహవసతి పరంగా రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 38.4 శాతం మందికి సొంత ఇల్లు లేదు. ఈ వర్గంలో ముస్లిం కుటుంబాలు 60 శాతం,ఓసీలు 50 శాతం ఉన్నారు. అయితే ఎస్టీలు 72శాతం,బీసీ-డీ వర్గాలు 70.3 శాతం మంది సొంత ఇళ్లలో నివసిస్తున్నారు. మరోవైపు 24 శాతం కుటుంబాలు ఒక్క గది ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నాయి. ఇందులో ఎస్సీలు 30.6 శాతం,ఎస్టీలు 34శాతం ఉన్నారు.

వివరాలు 

5.8శాతం మందికి విద్యుత్ కనెక్షన్ లేదు

తాగునీటి విషయంలో 23.3శాతం కుటుంబాలకు ఇంటి వద్ద నీటి కనెక్షన్ లేదు. ఇందులో ఎస్టీ కుటుంబాలు 32శాతం ఉన్నాయి. ఇంకా 9.4శాతం కుటుంబాలు సామూహిక నల్లాలపై ఆధారపడుతున్నాయి. ఇందులో ఎస్సీ,ఎస్టీ కుటుంబాలు కలిపి 12శాతం ఉన్నాయి. అయితే బీసీ-ఈ వర్గానికి చెందిన 80.3శాతం కుటుంబాలు రక్షిత నీటిని పొందుతున్నాయి. విద్యుత్ సదుపాయాల్లో కూడా అసమానతలు కనిపిస్తున్నాయి.మొత్తం కుటుంబాల్లో 5.8శాతం మందికి విద్యుత్ కనెక్షన్ లేదు. ఇందులో ఎస్టీలు 11.1 శాతం, ఎస్సీలు 8.2 శాతం, బీసీలు 4.8 శాతం, ఓసీలు 3.9 శాతం ఉన్నారు. మరుగుదొడ్ల సదుపాయం విషయంలో 13.4 శాతం కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి లేదు. ఇందులో ఎస్టీలు 32 శాతం, ఎస్సీలు 18.4 శాతం, బీసీలు 10.9 శాతం ఉన్నారు.

వివరాలు 

వంట ఇంధనం

వంట ఇంధనం విషయంలో కూడా కొంత వెనుకబాటుతనం కనిపిస్తోంది. రాష్ట్రంలో 8 శాతం కుటుంబాలకు వంట వాయువు అందుబాటులో లేదు. ఇందులో ఎస్టీలు 15.7 శాతం, ఎస్సీలు 9.7 శాతం, బీసీలు 6.8 శాతం, ఓసీలు 5.7 శాతం, బీసీ-ఈ వర్గాలు 7 శాతం ఉన్నాయి. ఇంకా 5.4 శాతం కుటుంబాలు ఇప్పటికీ కట్టెల పొయ్యిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇందులో ఎస్టీలు 13.2 శాతం, ఎస్సీలు 6.9 శాతం, బీసీలు 4.5 శాతం, ఓసీలు 2.5 శాతం ఉన్నారు.

Advertisement