Loading...
CII Partnership Summit 2026: విశాఖలో అంతర్జాతీయ సమ్మిట్‌కు రంగం సిద్ధం.. 59 దేశాల ప్రతినిధుల రాక!
విశాఖలో అంతర్జాతీయ సమ్మిట్‌కు రంగం సిద్ధం.. 59 దేశాల ప్రతినిధుల రాక!

CII Partnership Summit 2026: విశాఖలో అంతర్జాతీయ సమ్మిట్‌కు రంగం సిద్ధం.. 59 దేశాల ప్రతినిధుల రాక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 07, 2026
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్నం నగరం మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో 31వ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో జరగనుంది. 'నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్' అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఇందులో 59 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రపంచ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ అంతర్జాతీయ సదస్సు ప్రధాన ఉద్దేశం.

వివరాలు

సదస్సు ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సీఐఐ ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలు, అంకుర సంస్థలను అనుసంధానించడం ద్వారా సదస్సులో జరిగే చర్చలను వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యాల దిశగా తీసుకెళ్లాలని సూచించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని, పెట్టుబడులకు పూర్తి భద్రతతో పాటు సులభతర విధానాలు అందుబాటులో ఉన్నాయనే భరోసాను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు.

వివరాలు

59 దేశాల నుంచి 1,250 మందికి పైగా ప్రతినిధులు

ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాల్లో రాష్ట్రానికి ఉన్న పెట్టుబడి అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.

ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 1,250 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

వీరిలో 15 మంది విదేశీ మంత్రులు, 40 మందికి పైగా అంతర్జాతీయ వక్తలు, 350 మంది విదేశీ ప్రతినిధులు, 900 మంది భారతీయ ప్రతినిధులు ఉండనున్నారు.

సింగపూర్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), కెనడా, ఈజిప్ట్ తదితర దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఆరు కీలక అంశాలపై చర్చలు

వీరితో పాటు ప్రపంచ ఆహార కార్యక్రమం (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్), ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) వంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఆరు కీలక అంశాలపై ప్రధానంగా చర్చలు నిర్వహించనున్నారు.

వాణిజ్యం-పెట్టుబడులు, వ్యవసాయం-ఆహార భద్రత, నైపుణ్యాలు-అంతర్జాతీయ ఉపాధి, టెక్నాలజీ-భవిష్యత్ పరిశ్రమలు, స్వచ్ఛ ఇంధనం-సుస్థిర వృద్ధి వంటి అంశాలపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

400కు పైగా బీటుబీ, బీటుజీ సమావేశాలు

వ్యాపార సంస్థల మధ్య కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు 400కు పైగా బిజినెస్ టు బిజినెస్ (బీటుబీ) సమావేశాలను ఏర్పాటు చేశారు.

అలాగే ప్రభుత్వాలతో పరిశ్రమల సంప్రదింపుల కోసం బిజినెస్ టు గవర్నమెంట్ (బీటుజీ) సమావేశాలు కూడా నిర్వహించనున్నారు.

ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

రాష్ట్రంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు, ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది.

మొత్తంగా విశాఖ వేదికగా జరగనున్న 31వ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కీలక వేదికగా నిలవనుంది.

ADVERTISEMENT