పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సనాతన కుల వివక్షే: ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా తన తాన స్టేట్ మెంట్‌ను సమర్థించుకుంటూ సనాతన వివక్షపై పలు ఉదాహరణలు చెప్పారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించకపోవడం సనాతన కుల వివక్షకు ఉదాహరణ అని ఉదయనిధి స్టాలిన్ నొక్కి చెప్పారు. కుల వివక్షపై దీర్ఘకాలంగా డీఎంకే పోరాడుతోందని స్పష్టం చేశారు. పెరియార్ హేతువాద సూత్రాల పునాదులపై స్థాపించబడిన డీఎంకే దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన విషయం తెలిసిందే.
నేను మళ్లీ మళ్లీ మాట్లాడుతాను: ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మంపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎప్పుడూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూనే ఉంటుందని స్పష్టం ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వివక్షకు సంబంధించిన మహాభారతంలోని మరో అంశాన్ని ప్రస్తావించారు. ఏకలవ్యుని పట్ల ద్రోణాచార్య వ్యవహరించిన తీరును సామాజిక వివక్షగా ఆయన అభివర్ణించారు. ఉదయ్‌పై చర్య తీసుకోవడానికి అనుమతిని కోరుతూ తమిళనాడు గవర్నర్‌కు లేఖ రాసినట్లు సుబ్రమణ్యన్ స్వామి ట్విట్టర్(ఎక్స్)లో పేర్కొన్నారు. శనివారం చెన్నైలో జరిగిన తమిళనాడు ప్రగతిశీల రచయితలు, కళాకారుల సంఘం సమావేశంలో సనాతన ధర్మాన్ని 'కరోనావైరస్, మలేరియా, డెంగ్యూ'తో ఉదయనిధి పోల్చారు.