LOADING...
Srikakulam Stampede: శ్రీకాకుళం కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది భక్తుల మృతి
శ్రీకాకుళం కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది భక్తుల మృతి

Srikakulam Stampede: శ్రీకాకుళం కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది భక్తుల మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2025
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా, పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కార్తీక మాసం సందర్భంగా, ముఖ్యంగా ఈరోజు ఏకాదశి కావడంతో ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాల్లో గందరగోళం నెలకొంది. అయితే, పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తోపులాట ప్రారంభమైంది. ఈ క్రమంలో రెయిలింగ్‌ ఊడిపోవడంతో పలువురు భక్తులు కిందపడిపోయారు.

Details

పలువురికి గాయాలు

ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, గాయపడిన కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొక్కిసలాట ఘటన వీడియో