LOADING...
Andhra Pradesh: రూ.2,123 కోట్లతో 1,392 గ్రామీణ రోడ్ల అభివృద్ధి
రూ.2,123 కోట్లతో 1,392 గ్రామీణ రోడ్ల అభివృద్ధి

Andhra Pradesh: రూ.2,123 కోట్లతో 1,392 గ్రామీణ రోడ్ల అభివృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో రూ. 2,123 కోట్ల నాబార్డు రుణం, సాస్కీ నిధుల ద్వారా నాలుగు వంతెనలతో సహా 1,392 గ్రామీణ రహదారుల అభివృద్ధికి సవరించిన బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించింది. 26 జిల్లాల్లోని 157 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,122 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి సవరించిన అంచనాలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదించింది. ప్రభుత్వం వీటిని ఆమోదించడమే కాక, వెంటనే అనుసరించవలసిన చర్యలపై కూడా ఆదేశాలు జారీ చేసింది. మొదట ప్రభుత్వం నాలుగు వంతెనలను చేర్చుకుని 1,299 రహదారుల అభివృద్ధికి అనుమతిని మంజూరు చేసింది.

వివరాలు 

93 రోడ్ల అభివృద్ధికి ఇంజినీర్లు అంచనాల సవరణ 

అయితే, పలుమార్లు ఎమ్మెల్యేలు ఎక్కువ రోడ్ల అభివృద్ధికి మంజూరు చేసిన రహదారులను విభజించమని ప్రభుత్వాన్ని కోరడం వల్ల, రోడ్ల సంఖ్య 1,299 నుంచి 1,392కి పెరిగింది. అదనంగా మరో 93 రోడ్ల అభివృద్ధికి ఇంజినీర్లు అంచనాలను సవరించారు. ఈ అన్ని రోడ్ల అభివృద్ధి పనులు రాష్ట్ర గ్రామీణ రహదారుల పటిష్ఠత కార్యక్రమం కింద చేపట్టబడ్డాయి.

Advertisement