LOADING...
HRC: చేవెళ్ల ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సుమోటో కేసు నమోదు
చేవెళ్ల ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సుమోటో కేసు నమోదు

HRC: చేవెళ్ల ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సుమోటో కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద చోటుచేసుకున్న భయానక రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (SHRC) సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయి, 24 మంది గాయపడిన నేపథ్యంలో కమిషన్‌ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను డిసెంబర్‌ 15 లోపు సమర్పించాల‌ని కమిషన్‌ ఆదేశించింది. ఇందుకోసం రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.

Details

నివేదికను సమర్పించాలి

అదనంగా జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌లను కూడా నివేదిక అందజేయాలని ఆదేశించింది. సోమవారం ఉదయం మీర్జాగూడ గేటు సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొనడంతో ఈ విషాదం సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనకు సంబంధించి అన్ని విభాగాల బాధ్యతలను గుర్తించేందుకు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ సూచించింది.