LOADING...
Chandrababu: క్వాంటమ్ టెక్నాలజీపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి: ఏపీ సీఎం చంద్రబాబు
క్వాంటమ్ టెక్నాలజీపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu: క్వాంటమ్ టెక్నాలజీపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి: ఏపీ సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

సరైన సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్ని అయినా చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్టణంలో 28వ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. అలాగే డిజిటల్ ఏపీ సంచికను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "ప్రధాని నరేంద్ర మోదీ సరైన సమయంలో సరైన నాయకుడిగా ముందుకొచ్చారు. ప్రజలకు మేలు చేసే కొత్త సాంకేతిక సంస్కరణలను తీసుకొచ్చారు. సాంకేతికత మార్పులకు అనుగుణంగా మనం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి" అని పేర్కొన్నారు.

వివరాలు 

ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులలో 30 శాతం ఏపీ నుంచే..

అయితే, భారతీయులకు ఐటీ రంగంలో విశేష నైపుణ్యం ఉందని ఆయన తెలిపారు. "నాలెడ్జ్ ఎకానమీని ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హైదరాబాద్‌కు అధిక లాభం వచ్చింది. తెలంగాణలో కూడా ఆదాయంలో మంచి వృద్ధి కనిపిస్తోంది. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా, ప్రముఖ ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులలో దాదాపు 30 శాతం ఏపీ నుంచే వచ్చారు. అంతేకాక, ప్రపంచంలోని నాలుగు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్‌కు చెందినవారు. ముఖ్యంగా, భారతీయ ఐటీ నిపుణుల్లో ప్రతి నాలుగో వ్యక్తి ఏపీకి చెందినవారు" అని వివరించారు.

వివరాలు 

అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం 

"ప్రఖ్యాత సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ ప్రాజెక్టులో చేరుతున్నాయి. క్వాంటమ్ టెక్నాలజీపై మేము మరింత దృష్టి పెట్టి, రాష్ట్రంలో నూతన అవకాశాలను సృష్టించాలనుకుంటున్నాం" అని చంద్రబాబు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సులో చంద్రబాబు