#NewsBytesExplainer: తెలంగాణలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై లేని క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆపద మొక్కులు అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం. . ఎన్నికల సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్స్, సామాజిక వర్గాల ప్రాధాన్యతలకు సంబంధించిన జాబితా పార్టీకి ఇచ్చారు. ఒక పిసిసి చీఫ్ గడువు ముగిసింది, కొత్త పిసిసి అధ్యక్షుడు వచ్చాడు, ఆయన టర్మ్ సగం పూర్తయింది. అయితే pcc కమిటీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్స్ పోస్టుల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. "ఇదిగో, అదిగో" అని ప్రకటనలు వస్తున్నా, కసరత్తు దశలోనే సమయం ముగుస్తోంది. ముందుగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియమిస్తామని చెప్పారు,తర్వాత ఐదంతకీ అవకాశం ఉందని లీకులు వచ్చాయి.
వివరాలు
అసహనంగా సీనియర్ నేతలు
కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా పదవి కేటాయించలేదు. తాజాగా జరిగిన కొత్త DCC అధ్యక్షుల సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పోస్టులను భర్తీ చేయాల్సిందని ప్రకటించడం ద్వారా మళ్లీ ఆశలు నింపారు. ఏడాది క్రితం రోహిణ్ రెడ్డి, చామల కిరణ్, సంపత్ లాంటి నాయకుల పేర్లు చర్చలో వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదు. ప్రభుత్వంలో ఉన్న పదవులు రాకపోయినా, కనీసం పార్టీలో కీలకమైన పోస్టులను భర్తీ చేయకపోతే పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే చర్చ కొనసాగుతోంది. సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ఎదురుచూస్తున్నవారు నిరాశతో ఉండడం తప్ప, పార్టీకి సంతోషం కలిగించలేదు. దీంతో కొంతమంది అసహనంగా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.
వివరాలు
ఇప్పటికైనా అడుగు ముందుకు పడుతుందా? ఆగిపోతుందా?
వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు భర్తీ అవుతాయా, లేకపోతే... క్లారిటీ ఉంటే ఆపై ఆశ పెట్టుకున్నవారంతా సైలెంట్‌గా ఉండేవారే. కానీ ఇప్పటి వరకు మాత్రమే ఆశలు నింపడం జరుగుతోంది. పనిని విభజించడం, ప్రభుత్వం చేపట్టిన పథకాల ప్రచారం, ఆర్గనైజేషన్ పర్యవేక్షణ వంటి బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్స్ నిర్వహిస్తారు. అయినప్పటికీ పదవుల భర్తీ విషయంలో స్పష్టత లేమి కొనసాగుతోంది. DCC అధ్యక్షుల సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చేసిన ప్రకటన ఇంతకే పరిమితం అవుతుందా, లేక ఈసారి నిజంగా పదవులు భర్తీ చేయబడతాయా అని కాంగ్రెస్‌లోని శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.