LOADING...
DeepFake: డీప్‌ఫేక్‌పై కఠిన చర్యలు.. నియంత్రించేందుకు లోక్‌సభలో బిల్లు
డీప్‌ఫేక్‌పై కఠిన చర్యలు.. నియంత్రించేందుకు లోక్‌సభలో బిల్లు

DeepFake: డీప్‌ఫేక్‌పై కఠిన చర్యలు.. నియంత్రించేందుకు లోక్‌సభలో బిల్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత కృత్రిమ మేధస్సు (AI) యుగంలో వేగంగా పెరుగుతున్న సమస్యల్లో డీప్‌ఫేక్‌ (DeepFake) ఒక్కటే కాదు, అత్యంత ప్రమాదకరమైనదిగా కూడా పరిగణించబడుతోంది. వ్యక్తుల ముఖం, గళం, హావభావాలను నకిలీగా సృష్టించి తప్పుదారి పట్టించే ఈ టెక్నాలజీ సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇదే నేపథ్యంలో డీప్‌ఫేక్‌ నియంత్రణకు సంబంధించిన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే (Shrikant Shinde) ప్రయివేటు మెంబర్ బిల్లు రూపంలో ఈ ప్రతిపాదనను సమర్పించారు. డీప్‌ఫేక్‌ కంటెంట్ తయారు చేయడానికి వ్యక్తుల ముందస్తు అనుమతి తప్పనిసరి చేసే న్యాయపరమైన వ్యవస్థను రూపొందించాలని ఆయన కోరారు.

Details

ఫార్వర్డ్ చేసినా బాధ్యుతలపై చర్యలు

వేధింపులు, మోసాలు, తప్పుడు ప్రచారం కోసం డీప్‌ఫేక్‌లను భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శిందే స్పష్టం చేశారు. ఇలాంటి కంటెంట్‌ను తయారు చేసినా, వాటిని ఫార్వర్డ్ చేసినా బాధ్యులపై శిక్షలు విధించేలా చట్టం ఉండాలని అభిప్రాయపడ్డారు. డీప్‌ఫేక్‌లు వ్యక్తిగత గోప్యతను మాత్రమే కాదు, జాతీయభద్రతను కూడా ప్రమాదంలో పడేస్తున్నాయని శిందే గుర్తుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ టెక్నాలజీ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుండటమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇంకా, డీప్‌ఫేక్‌ల దుష్ప్రభావంపై ప్రధాని మోదీ కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నకిలీ వీడియోలు, ఆడియోలు సమాజానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు. .

Advertisement