తదుపరి వార్తా కథనం
Telangana: జెన్కో, ట్రాన్స్కో లో సమ్మెలపై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 22, 2025
05:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పవర్ కార్పొరేషన్లలో వచ్చే ఆరు నెలలపాటు సమ్మెలను నిషేధించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం,ట్రాన్స్‌కో (TransCo)లోని మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు,జెన్కో (GenCo)లోని విద్యుత్ ఉద్యోగులు ఎలాంటి సమ్మెలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు నవంబర్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి.గతంలో, మే 10 నుంచి నవంబర్ 9 వరకు పవర్ కార్పొరేషన్లలో సమ్మెలపై నిషేధం విధించిన ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి. తాజాగా,రాష్ట్ర ప్రభుత్వం ఆ నిషేధాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది. అలాగే, ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఉద్యోగులపై, అలాగే సంబంధిత సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది.