UGC: డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్, లైంగిక వేధింపులతో విద్యార్థిని మృతి.. యూజీసీ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మశాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని సీనియర్ల ర్యాగింగ్, ప్రొఫెసర్ లైంగిక వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఈ విషాదకర సంఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. UGC సీనియర్ అధికారుల ప్రకారం, విద్యార్థిని ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు మీడియా నివేదికల ఆధారంగా సుమోటో కేసు నమోదు చేశారు. అయితే కళాశాల అధికారులు ఆమె మరణం ఆత్మహత్య కాదని, సాధారణ మరణమని పేర్కొన్నారు.
Details
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. UGC కమిటీని ఏర్పాటు చేసి, దోషులను వదలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్టు వెల్లడించింది. సమగ్ర వివరాల్లో, బాధితురాలిపై ముగ్గురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. మరోవైపు, ప్రొఫెసర్ అశోక్‌కుమార్ ఆమెను లైంగికంగా వేధించాడు. దాడిలో గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబరు 26న ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు, ముగ్గురు విద్యార్థులు, ప్రొఫెసర్ పోలీస్ అదుపులోకి తీసుకున్నారు.