
Rajasthan: విద్యార్థి దారుణ హత్య.. రాడ్లతో, గొలుసుతో కొట్టి!
ఈ వార్తాకథనం ఏంటి
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో తరుచూ రాజస్థాన్‌లోని కోటా వార్తల్లో నిలుస్తుంది.
తాజాగా ఓ విద్యార్థి హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
ఐఐటీ-జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న 17ఏళ్ల సత్యవీర్ అలియాస్ రాజ్‌వీర్, అలియాస్ రోనాక్‌పై సోమవారం సాయత్రం దాడి చేశారు.
ఇందిరా విహార్ ప్రాంతంలో కొందరు యువకులు ఇనుప రాడ్లు, గొలుసులతో విచక్షణ రహితంగా కొట్టారు.
అయితే బాధితుడు చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Details
కేసు నమోదు చేసిన పోలీసులు
సత్యవీర్ రెండేళ్లుగా కోటాలోని ఐఐటీ-జెఈఈ కోచింగ్ తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
బాధితుడిపై యువకులు ఎందుకు దాడి చేశారో కారణాలు తెలియాల్సి ఉందని, ప్రస్తుతం అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి హత్యకు గురి కావడంతో కోటాలోని విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు.