NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే
    తదుపరి వార్తా కథనం
    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే
    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏంచెప్పిందంటే

    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే

    వ్రాసిన వారు Stalin
    May 09, 2023
    10:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతా సహా బెంగాల్‌లోని దక్షిణ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది.

    మోచా తుపాను వల్ల వీచే వాయువ్య గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం సూచించింది.

    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడానికి గల కారణాలను వివరిస్తూ ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) అలీపూర్ ఒక ప్రకటన విడుదల చేసింది.

    మోచా తుపాను ప్రభావం కారణంగా నీటి ఆవిరి బంగాళాఖాతంలోకి ప్రవహిస్తోందని చెప్పింది.

    మోచా సైక్లోన్ అనేది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే ఉష్ణమండల తుపానుగా పేర్కొంది.

    కోల్‌కతాకు చెందిన ఐఎండీ సీనియర్ వాతావరణ అధికారి సౌరిష్ బెనర్జీ మాట్లాడుతూ, బెంగాల్‌లో మరొక హీట్‌వేవ్ రానున్నట్లు, ఇది బుధవారం నుంచి ఉండొచ్చని అంచనా వేశారు.

    ఐఎండీ

    మూడు రోజుల పాటు హీట్‌వేవ్ హెచ్చరికలు 

    బెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో మంగళవారం నుంచి గురువారం వరకు 40-42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ సూచించింది.

    మోచా తుపాను ప్రభావం కారణంగా మంగళవారం నుంచి ప్రజలకు ఇబ్బందులు తప్పవని బెనర్జీ తెలిపారు.

    బీర్భూమ్ ఈస్ట్, వెస్ట్ బుర్ద్వాన్, బంకురా, పురూలియా, వెస్ట్ మేదినీపూర్‌లకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేశాయి.

    మాల్డా, ఉత్తర, దక్షిణ దినాజ్‌పూర్ వంటి మధ్య జిల్లాల్లో కూడా బుధవారం బుధవారం ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉంది.

    బంకురా, పురూలియా, పశ్చిమ బుర్ద్వాన్, బీర్భూమ్‌తో సహా పశ్చిమ జిల్లాల్లో గురువారం వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వర్గాలు తెలిపాయి.

    ఐఎండీ

    గాలిలో వేగంగా తగ్గుతున్న నీటి ఆవిరి

    మే 8న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మే 9న అది ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ చెప్పింది.

    వాయువ్య గాలులు వాతావరణం వేడెక్కడానికి దారితీశాయని, గాలిలో నీటి ఆవిరి శాతం వేగంగా తగ్గుతుందని, ఇది సాధారణంగా మేలో అత్యల్పంగా 50 శాతం ఉంటుందని ఆయన అన్నారు.

    ఇదిలా ఉండగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అండమాన్, నికోబార్‌లో మే 8 నుంచి మే 12వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. ఇది రాబోయే రోజుల్లో తుపానుగా మారే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐఎండీ
    పశ్చిమ బెంగాల్
    ఉష్ణోగ్రతలు
    తాజా వార్తలు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఐఎండీ

    తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ తెలంగాణ
    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా భారతదేశం

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్

    ఉష్ణోగ్రతలు

    మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు భూమి
    తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు  తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు  పెన్షన్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన  శ్రీకాకుళం
    కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం బ్రిటన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025