సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలంలో కరెంట్ వినియోగం పెరగడం, విద్యుత్ కంపెనీల నుంచి బొగ్గుకు డిమాండ్ పెరిగింది.
దీంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) యాజమాన్యం రోజుకు కనీసం 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని కొనసాగించాలని చూస్తోంది.
అలాగే 2.35 లక్షల టన్నులు రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
కంపెనీలోని అన్ని మైనింగ్ ప్రాంతాల్లో లక్ష్యాలను అందుకోవాలని సూచించింది.
మైనింగ్ ఏరియాల డైరెక్టర్లు, జనరల్ మేనేజర్‌లతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ఈ మేరకు లక్ష్యాలను నిర్దేశించారు.
సింగరేణి
వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు నెలవారీ లక్ష్యాలను సాధించాలి: సీఎండీ
లక్ష్యాన్ని చేరుకోవడానికి రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాను పెంచాలని అధికారులను సీఎండీ కోరారు.
గనుల విస్తరణకు తక్షణమే అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు నెలవారీ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు.
ఓపెన్ కాస్ట్ గనుల నుంచి రోజుకు 14.78 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపును 16.5 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచాలని శ్రీధర్ అధికారులకు సూచించారు.
డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్) ఎన్ బలరామ్, డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్‌వీకే శ్రీనివాస్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) జి వెంకటేశ్వర్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.